Amit Shah | ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా (Prime Minister) ఇందిరాగాంధీ (Indira Gandhi) పేరుతో ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. మోదీ తర్వాత కేంద్ర హోంమంత్రి (Home Minister) అమిత్ షా (Amit Shah) సైతం ఓ సరికొత్త రికార్డు నెలకొల్పారు. దేశ చరిత్రలో ఎవరూ అందుకోలేని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
దేశ చరిత్రలో అత్యధిక కాలం కేంద్ర హోంశాఖమంత్రిగా (countrys longest serving Home Minister) పని చేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకూ బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీ పేరుతో ఉన్న రికార్డును షా బద్దలు కొట్టారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అమిత్షా 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లోనూ మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది.
దీంతో షా వరుసగా రెండోసారి కూడా హోంశాఖ బాధ్యతలనే స్వీకరించారు. దీంతో షా హోంశాఖ బాధ్యతలు స్వీకరించి నేటికి ఆరు సంవత్సరాల 64 రోజులు పూర్తైంది. దాదాపు 2,194 రోజులు అమిత్ షా హోం మంత్రిగా పనిచేశారు. ఫలితంగా బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ రికార్డును షా బద్దలుకొట్టారు. 1998-1999, 1999-2004 వరకూ ఎల్కే అద్వానీకేంద్ర హోం మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. దాదాపు 2,193 రోజులు అద్వానీ ఈ పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును అమిత్ షా అధిగమించారు. ఇక కేంద్ర హోం శాఖ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా తన హయాంలో ఆర్టికల్ 370 రద్దు సహా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా దేశంలో నక్సలిజంపై ఉక్కుపాదం మోపుతున్నారు.
Also Read..
Anil Ambani | 17 వేల కోట్ల రుణ మోసం.. ఈడీ ముందు విచారణకు హాజరైన అనిల్ అంబానీ
Hansika Motwani | మరో సెలబ్రిటీ జంట విడాకులు.. ఇన్స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్..!