న్యూఢిల్లీ : బీజేపీకి అధికారమే పరమావధి అని, అందుకోసం జాతుల మధ్య చిచ్చుపెడుతున్నదని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. బీజేపీని ఓడించకపోతే దేశం యావత్తు మణిపూర్‌లా మంటల్లో కాలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన రాజస్థాన్‌లో మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని పేర్కొన్నారు. హింసతో మణిపూర్ అట్టుడికిపోతుంటే, ప్రధాని మోదీ మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.