బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 15, 2020 , 10:49:43

సూర్యాపేటలో ఐదేండ్ల బాలుడు అదృశ్యం

సూర్యాపేటలో ఐదేండ్ల బాలుడు అదృశ్యం

సూర్యాపేట :  పటాకులు కొనేందుకు వెళ్లి బాలుడి అదృశ్యమయ్యాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్‌ నగర్‌ శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. భగత్‌సింగ్‌ నగర్‌కు పరికపల్లి మహేశ్‌ కుమారుడు పరికపల్లి గౌతమ్‌ (5) శనివారం దీపావళి కావడంతో పటాకులు కొనుక్కునేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లాడు.

చాలాసేపటి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు బంధువులు, తెలిసిన వారి ఇండ్లలో ఆరా తీశారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు అదృశ్యంకావడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.