Jharkhand | హజారీబాగ్: జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో భార్యాభర్తల ఘర్షణ ఐదుగురి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిష్ణుగఢ్ సమీపంలోని చర్హిలో సుందర్ కుర్మలి (27) తన భార్య రూపా దేవితో ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన సుందర్ తన బైక్‌ను వేగంగా నడుపుకుంటూ వెళ్లి, బావిలో పడిపోయారు.
ఆయనను కాపాడటం కోసం ఒకరి తర్వాత మరొకరు నలుగురు బావిలో దిగారు. సుందర్‌తోపాటు ఆ నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపించారు.