శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జమ్ములోని కత్రా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి భూమి కంపించింది. దీనితీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. రాత్రి 11.23 గంటల సమయంలో భూమి కంపించిందని, భూకంప కేంద్రం కత్రాకు 71 కిలోమీటర్ల దూరంలో ఉందని ఎన్సీఎస్ తెలిపింది. భూమి అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు సభవించాయని పేర్కొన్నది.
24 గంటల వ్యవధిలో జమ్ముకశ్మీర్‌లో ఐదుసార్లు భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 2.20 గంటల సమయలో కత్రాకు 61 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 2.6గా నమోదయిందని ఎన్సీఎస్ తెలిపింది. రెండోది.. దోడాకు 9 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 3.21 గంటలకు 2.6 తీవ్రతతో, ఉధంపూర్‌లో తెల్లవారుజామున 3.44 గంటల సమయంలో 2.8 తీవ్రత, ఉదయం 8.03 గంటలకు 2.9 తీవ్రతలో వరుస భూకంపాలు వచ్చాయని వెల్లడించింది.