Hospital | దేశరాజధాని ఢిల్లీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రిలో (Delhi Hospital) అగ్నిప్రమాదం (Fire) సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికాస్ మార్గ్ (Vikas Marg)లోని కోస్మోస్ ఆస్పత్రి (Kosmos hospital)లో శనివారం మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సుమారు ఎనిమిది మంది రోగులను సమీపంలోని పుష్పాంజలి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
#WATCH | Delhi | Fire broke out at the Kosmos hospital, Vikas Marg, at around 12.20 pm. One person died in the incident. Eight patients were shifted to the nearby Pushpanjali Hospital. A case u/s 287/106(1) BNS (285/304A IPC) is being registered: Delhi Police pic.twitter.com/Ks7nLmCcnd
— ANI (@ANI) August 9, 2025
Also Read..
Aircraft Crash | పూణెలో ప్రమాదానికి గురైన శిక్షణ విమానం