Supreme Court | దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది (Fire breaks out). కోర్టు నంబర్ 11, 12 మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం దట్టమైన పొగ వ్యాపించింది.
వెంటనే అప్రమత్తమైన కోర్టు భద్రతా సిబ్బంది.. అగ్నిమాపక శాఖ అధికారుల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ (short circuit) కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో 11వ నంబర్ గదిలో జరగాల్సిన బెంచ్ విచారణలను తాత్కాలికంగా రద్దు చేశారు (judicial proceedings were suspended).
Major fire averted in the Supreme Court. pic.twitter.com/eI586zNAZb
— Mohit Pandey (@pandeymohitt) December 2, 2024
Also Read..
Urfi Javed | ఐకానిక్ డ్రెస్‌ను సేల్కు పెట్టిన ఉర్ఫీ జావెద్.. ధర తెలిస్తే షాకే..!
IPS Officer | డ్యూటీలో చేరేందుకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన యువ ఐపీఎస్ అధికారి
Farmers March | రైతుల ఆందోళన.. ఢిల్లీ – నోయిడా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్