IPS Officer | శిక్షణ పూర్తి చేసుకొని డ్యూటీలో చేరేందుకు వెళ్తున్న ఓ ఐపీఎస్ ఆఫీసర్ (IPS Officer)ని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో సదరు ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. విధుల్లో చేరాల్సిన అతను విగతజీవిగా మార్చురీలో చేరాడు. ఈ ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన హర్ష వర్ధన్ (26) సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఎంచుకున్నారు. కర్ణాటక కేడర్‌లో ఐపీఎస్‌కు ఎన్నికైన అతను.. మైసూరులోని కర్ణాటక పోలీస్ అకాడమీ ( Karnataka Police Academy)లో తన నాలుగు వారాల శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో హసన్ (Hassan) జిల్లాలో ప్రొబేషనరీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా అతనికి తొలి పోస్టింగ్ వచ్చింది. సోమవారం డ్యూటీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది (Take Up First Posting). దీంతో అతను ఆదివారం రాత్రి అక్కడికి పయనమయ్యారు. ఇంతలో మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. సోమవారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
కారు టైరు ఒక్కసారిగా పేలింది. అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిని, ఆపక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో హర్ష వర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాద తీవ్రత కారణంగా అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
Also Read..
Farmers March | రైతుల ఆందోళన.. ఢిల్లీ – నోయిడా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్
Sabarmati Report | పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ది సబర్మతి రిపోర్ట్ స్క్రీనింగ్.. వీక్షించనున్న మోదీ
Parliament Winter Session | పార్లమెంట్లో అదే రభస.. ఉభయసభలు రేపటికి వాయిదా