Parliament Winter Session | పార్లమెంట్లో (Parliament Winter Session) వాయిదాల పర్వం కొనసాగుతోంది. యూపీలోని సంభల్‌లో చెలరేగిన హింస, అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. సమావేశాలు ప్రారంభమైన గంట వ్యవధిలోనే ఉభయసభలు రేపటికి (డిసెంబర్ 3)కి వాయిదా పడ్డాయి.
శుక్రవారం వాయిదా పడిన ఉభయసభలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. ఎగువ, దిగువ సభలు ప్రారంభం కాగానే సభలో అదానీ, సంభల్‌లో హింసాకాండపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 వరకూ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు.
Also Read..
Sabarmati Report | పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ది సబర్మతి రిపోర్ట్ స్క్రీనింగ్.. వీక్షించనున్న మోదీ
Ludo | మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు ఏం చేశాడో చూడండి.. వైరల్ పిక్
Donald Trump | బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.. హంటర్‌కు క్షమాభిక్షపై ట్రంప్ స్పందన