Urfi Javed | ఉర్ఫీ జావెద్ (Urfi Javed).. ఈ పేరు తెలియని వారు ఉండరు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి సుపరిచితమే. హాట్ హాట్ ఫొటోలతో సోషల్‌మీడియాలో హీట్ పుట్టిస్తుంటుంది. కొత్త కొత్త ఫొటో షూట్స్ తో కుర్రకారు మతిపోగొడుతుంటుంది. ఎవరూ ఊహించని విధంగా వెరైటీ ఔట్ఫిట్స్ (దుస్తులు)లో దర్శనమిస్తూ.. ఉర్ఫీ జావెద్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటుంది.
అయితే, తాజాగా ఈ బ్యూటీ తన కలెక్షన్స్‌లోని ఓ ఐకానిక్ డ్రెస్‌ను సేల్కు (Butterfly Dress On Sale) పెట్టింది. ఓ ఈవెంట్లో ఉర్ఫీ సీతాకోక చిలుకల థీమ్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్‌ను ధరించిన విషయం తెలిసిందే. ఆఫ్-షోల్డర్ నెక్లైన్ ఫాబ్రిక్‌తో స్టిచ్ చేసిన త్రీడీ ఫ్లోరల్ బ్లాక్ డ్రెస్ నెటిజన్లకు తెగ నచ్చింది. ప్రస్తుతం ఆ డ్రెస్‌నే ఉర్ఫీ విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే, దీని ధర ఏకంగా రూ.3 కోట్లకుపైనే అని ప్రకటించింది.
‘హాయ్ మై లవ్లీస్.. అందరికీ చాలా ఇష్టమైన నా సీతాకోకచిలుక డ్రెస్‌ను విక్రయించాలని నిర్ణయించుకున్నా. దీని ధర కేవలం రూ. 36,690,000 మాత్రమే (మూడు కోట్లా 66 లక్షలా 90 వేలు). ఆసక్తి ఉన్న వాళ్లు సంప్రదించగలరు’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ సీతాకోక చిలుకల డ్రెస్‌ను వేసుకున్న ఫొటోలను కూడా జతచేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు చెప్పినదానికంటే నా దగ్గర రూ.50 మాత్రమే తక్కువ ఉంది. లేదంటే నేను కొనిందు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఈఎమ్ఐ ఆప్షన్ లేదా..?’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Vikrant Massey | నటనకు బ్రేక్.. 12th Fail హీరో సంచలన ప్రకటన
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట