న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దిల్షాద్ గార్డెన్‌లోని దామోదర్ పార్క్‌లోని మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) కార్యాలయానికి సమీపంలో ఉన్న కార్మాగారంలో గురువారం మంటలు చెలరేగాయి. మంటలకు పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 15 ఫైర్ ఇంజిన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH Delhi: Fire breaks out in a factory near MTNL office at Damodar Park, Dilshad Garden Industrial Area. 15 fire tenders are carrying out fire fighting operations. pic.twitter.com/tGy7DwOv3o
— ANI (@ANI) April 8, 2021