Fire Accident | ఫ్యాక్టరీ గోడౌన్లో అగ్నిప్రమాదం..12 గంటలైనా మండుతూనే ఉందన్న అధికారులు
ఒక గోడౌన్లో అంటుకున్న మంట ఉగ్రరూపం దాల్చింది. 12 గంటలుగా అగ్నిమాపక సిబ్బంది పోరాడుతున్నా ఈ మంటలు ఆరలేదు. ఈ ఘటన కోల్‌కతాలోని మెహర్ అలీ లేన్‌లో జరిగింది. టాంగ్రా ఏరియాలోని ఒక గోడౌన్లో మంటలు అంటుకున్నాయి. ఈ విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఒక ఫ్యాక్టరీకి చెందిన ఈ గోడౌన్లో మంటలు ఆర్పేందుకు 15 ఫైరింజన్లు శ్రమిస్తున్నాయి. శనివారం సాయంత్రం 6.30 ప్రాంతంలో ఈ మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. 12 గంటలు శ్రమిస్తే గోడౌన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంటలు పూర్తిగా ఆర్పేశామని, ఇంకా కొన్ని చోట్ల అగ్నిని అదుపుచేయాలని తెలుస్తోంది.
‘‘గోడౌన్లో వేగంగా మంటలు అంటుకునే పదార్థాలు ఉండటంతో మంటలన పూర్తిగా అదుపుచేయడానికి ఆలస్యం అవుతోంది. లోపలకు వెళ్లడం కుదరడం లేదు. ఈ మంటలు ఆర్పే క్రమంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది కూడా ఆస్పత్రి పాలయ్యారు’’ అని డివిజనల్ ఫైర్ ఆఫీసర్ దేబ్తాను ఘోష్ తెలిపారు.
The fire has not been completely extinguished even after 10 hours as there are some highly inflammable materials in the godown and we are not able to enter inside. Two fire brigade personnel were injured during the dousing operation: Debtanu Ghosh, Divisional Fire Officer pic.twitter.com/vPYYOthNZx
— ANI (@ANI) March 12, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

