Kolkata | కోల్కతాలో (Kolkata) ఆర్జీ కార్ వైద్యశాలలో (R G Kar Medical College) 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలి అత్యాచార, హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘటనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గురువారం అర్ధరాత్రి ఆర్జీ కార్ మెడికల్ కాజేజీలో కొందరు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ మేరకు దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆసుపత్రి ప్రాంగణంలో హింస, సిబ్బంది, కార్యకర్తలపై (Healthcare Workers) దాడులు జరిగిన ఆరు గంటల్లోగా ఫిర్యాదు నమోదు చేయాలని (FIR Within 6 Hours) ఆదేశించింది. నిర్ణీత గడువులోగా అలాంటి ఫిర్యాదు అందకపోతే సంబంధిత ఇన్స్టిట్యూట్ హెడ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై దాడులు సర్వసాధారణంగా మారడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. తమ విధి నిర్వహణలో అనేక మంది ఆరోగ్య సిబ్బంది శారీరక హింసకు గురవుతున్నారని తెలిపింది. మరికొందరికి బెదిరింపులు వచ్చాయని, ఈ హింసలో ఎక్కువ శాతం రోగులు లేక రోగుల అటెండర్ల ద్వారా ఎదుర్కొన్నవేనని మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించింది. విధి నిర్వహణలో ఉన్న ఆరోగ్య కార్యకర్త, సిబ్బందిపై ఏదైనా హింస జరిగినట్లయితే.. ఆరు గంటల్లోగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేసింది. దీనికి ఆసుపత్రి అధిపతి బాధ్యత వహిస్తారని కేంద్రం వెల్లడించింది.
In the event of any violence against any healthcare worker while on duty, the Head of Institution shall be responsible for filing an Institutional FIR within a maximum of 6 hours of the incident: Ministry of Health and Family Welfare pic.twitter.com/2YGDZVRx8O
— ANI (@ANI) August 16, 2024
Also Read..
Bombay High Court | బీజేపీ ఎంపీ నారాయణ్ రాణేకు బాంబే హైకోర్టు సమన్లు.. ఎందుకంటే..!
Doctors protest | మా డిమాండ్స్ వినకపోతే అత్యవసర సేవలు నిలిపేస్తాం : జూనియర్ డాక్టర్స్