Jogu Ramanna | సోయాబీన్ పంట కొనాలని ధర్నా.. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్టు
Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లా బంద్‌లో భాగంగా ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సోయాబీన్ పంటను కొని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు.
Jogu Ramanna | రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతోంది. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు అఖిలపక్ష రైతు, ప్రజా సంఘాల నేతలు, వ్యాపార సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య కాసేపు తోపులాట జరిగింది. కాగా, డిపో ముందు బస్సులను అడ్డుకున్న జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మావల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

