Bombay High Court : మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే (Narayan Rane) కు బాంబే హైకోర్టు (Bombay High Court) సమన్లు జారీచేసింది. తమ నోటీసులకు సెప్టెంబర్ 12 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. గత లోక్సభ ఎన్నికల్లో రత్నగిరి-సింధుదుర్గ్ (Ratnagiri-Sindhu Durg) నియోజకవర్గం నుంచి నారాయణ్ రాణే బీజేపీ తరఫున, వినాయక్ రౌత్ ఉద్ధవ్ థాకరే శివసేన తరఫున పోటీపడ్డారు.
ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నారాయణ్ రాణే విజయం సాధించారు. దాంతో రాణే ఎన్నికల నిబంధనను ఉల్లంఘించారని, ఆయన గెలుపును రద్దు చేయాలని కోరుతూ వినాయక్ రౌత్ కోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. నారాయణ్ రాణేకు నోటీసులు జారీచేసింది. తమ నోటీసులకు వచ్చే నెల 12 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. బాంబే హైకోర్టులో జస్టిస్ సారంగ్ కొత్వాల్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్పై విచారణ జరిపింది.