Doctors protest : కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్స్ కలిసి సంయుక్తంగా ఆందోళన చేస్తున్నాయి. న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్ దగ్గర ప్రొటెస్ట్ మార్చ్ నిర్వహించాయి.
తాము ఓపీ సేవలను నిలిపివేసి గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇకనైనా తమ డిమాండ్లను వినకపోతే అత్యవసర సేవలను కూడా నిలిపివేయాల్సి వస్తుందని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. అత్యవసర సేవలను నిలిపేసి రోగులను ఇబ్బందులు పెట్టాలనేది తమ ఉద్దేశం కాదని, ప్రభుత్వం మా డిమాండ్లను లెక్కచేయకపోతే అదే తమ ఆఖరి ఆప్షన్ అవుతుందని చెప్పారు.
#WATCH | Delhi: A protesting doctor says, “… If our demands are not heard, we will stop all emergency services. We don’t want to do that but it will be our last resort if we are not heard.” https://t.co/MEqdFLCiDA pic.twitter.com/ij7KY4LfR5
— ANI (@ANI) August 16, 2024