Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఆయన దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలంగా నాటారని అన్నారు. అయితే, ఆయన విధానాలని గుడ్డిగా సమర్థించనని వ్యాఖ్యానించారు.
కేరళ (Kerala)లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలకు అర్హమైనవని పేర్కొన్నారు. 1962లో చైనా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో తప్పులు ఉన్నాయన్నారు. దాని సాకుగా బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఆయన పేరును దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. దేశంలోని సమస్యలన్నింటికీ ఆయనను మాత్రమే నిందించడం అన్యాయమని పేర్కొన్నారు. సమస్య ఏదైనా.. ప్రతిదానికీ నెహ్రూపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘నేను నెహ్రూ అభిమానిని. ఆయన్ని ఆరాధిస్తాను. ఆయన పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అలా అని ఆయన నమ్మకాలు, విధానాలన్నింటినీ నేను వంద శాతం సమర్థించను. నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలకు అర్హమైనవే. ముఖ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చాలా దృఢంగా నెలకొల్పారు. అలా అని వారు (మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి) ప్రజాస్వామ్య వ్యతిరేకులని నేను అనను. కానీ వారు ఖచ్చితంగా నెహ్రూ వ్యతిరేకులు. తమకు అనుకూలంగా ఆయన పేరును దుర్వినియోగం చేస్తున్నారు. దేశంలోని సమస్యలన్నింటికీ ఆయనను మాత్రమే నిందించడం అన్యాయం’ అని థరూర్ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Cook Arrested: చపాతీలపై ఉమ్మిన వీడియో వైరల్.. కుక్‌ను అరెస్టు చేసిన పోలీసులు
ఈడీని ఇష్టారీతిన వాడుతున్న కేంద్రం.. బెంగాల్లో విపక్షాల స్ట్రాటజీలు కొట్టేసేందుకు దాడులు
Trump Tariffs | భారత్‌పై 500% సుంకాలు.. కొత్త బిల్లుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్