హర్యానా : భార్యతో గొడవపడిన భర్త తన నలుగురు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన మనోజ్ మహతో (45), ప్రియ భార్యాభర్తలు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మహతో ఆమెతో తరచూ గొడవపడేవాడు. మంగళవారం మరోమారు గొడవ జరిగింది.
అనంతరం పార్క్‌కు తీసుకెళ్తున్నట్టు చెప్పి మూడు నుంచి పదేండ్ల వయసున్న నలుగురు కుమారులతో కలిసి ఇంటి నుంచి బయలుదేరాడు. పార్క్‌కు బదులుగా వారిని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వారికి కోరినవన్నీ కొనిచ్చాడు. అనంతరం పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.