చండీగఢ్: పంటలకు ఇస్తున్న కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించడంతోసహా వివిధ డిమాండ్లపై రైతుల ప్రతినిధులు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలోని కేంద్ర బృందం మధ్య శుక్రవారం చర్చలు జరిగాయి. తదుపరి విడత చర్చలు ఫిబ్రవరి 22న జరుగుతాయి.
రైతులతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమావేశంలో రైతు నాయకులకు వివరించామని ఆయన తెలిపారు.