చండీగఢ్: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వందలాది రైతులు శుక్రవారం చండీగఢ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. వందకు పైగా బస్సులు, ట్రాక్టర్-ట్రాలీల్లో రైతులు నగరంలోకి ప్రవేశించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల ధర్నా వల్ల నగరంలోని పలు కీలక రోడ్లలో గంటకు పైగా భారీ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తమ ధర్నా గురించి రైతులు ముందుగానే ప్రకటించినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు సరిగా సిద్ధం కాకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.