న్యూఢిల్లీ : నీట్ యూజీ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు.
పరీక్షా పత్రాల లీకేజీ కారణంగా 11 మంది నీట్ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్కో బాధిత కుటుంబానికి రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.