శ్రీనగర్: పెళ్లి పేరుతో అబ్బాయిలను మోసగించి దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఒక వ్యక్తి ఫిర్యాదుతో నకిలీ పెళ్లి రాకెట్‌పై పోలీసులు దర్యాప్తు చేశారు. (Fake Marriage Racket Busted) వధువుతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఈ సంఘటన జరిగింది. జమ్ము జిల్లాలోని డోరి డాగర్‌కు చెందిన రష్పాల్ చంద్‌ను దీపక్ కుమార్ అనే వ్యక్తి సంప్రదించాడు. అతడికి పెళ్లి సంబంధం కుదుర్చడంతోపాటు దగ్గరుండి వివాహం జరిపిస్తానని నమ్మించాడు. రష్పాల్ చంద్ నుంచి మూడు లక్షలు వసూలు చేశాడు. ఒక మహిళతో అతడికి పెళ్లి జరిపించాడు. అయితే రెండు రోజుల్లోనే ఆ మహిళ అక్కడి నుంచి పారిపోయింది.
కాగా, బాధిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే అఖ్నూర్లో ఐదు కేసులు, నగ్రోటాలో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో నకిలీ వివాహాలు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయ్యింది. పెళ్లి కాని, వయసుపైబడి పెళ్లి సంబంధాలు కుదరని వ్యక్తులను ఈ ముఠా టార్గెట్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పూంచ్‌కు చెందిన దీపక్ కుమార్, వికాస్ కుమార్, బీహార్‌కు చెందిన అరుణ్ కుమార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇస్తఖర్, వధువు కుసుమ్ లతను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Reports Wife Missing | భార్య మిస్సింగ్‌పై భర్త ఫిర్యాదు.. హత్య చేసినట్లు పట్టించిన కలరా ఉండలు