న్యూఢిల్లీ : శుభాన్షు ఐఎస్ఎస్ యాత్రతో భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ మిషన్‌కు కీలక అడుగులు పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2027లో ‘గగన్‌యాన్’లో భాగంగా 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూదిగువ కక్ష్యలోకి ముగ్గురు వ్యోమగాములను పంపించాలని ఇస్రో భావిస్తున్నది.
ఐఎస్ఎస్లో శుభాన్షు గడించే అనుభవం దీనికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భార రహిత స్థితిలో మానవ జీవక్రియలు, లిక్విడ్ కూల్ గార్మెంట్స్, మెడికల్ మానిటరింగ్ తదితర విషయాలపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.