e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News జమ్మూకశ్మీర్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

జమ్మూకశ్మీర్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

జమ్మూకశ్మీర్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

అవంతిపుర : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురలో భద్రతాదళాలు భారీగా పేలుడు పదార్థాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. నౌదాల్‌ ట్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను నిల్వ చేసినట్లు భద్రతా సిబ్బందికి విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు అవంతిపుర పోలీసులు, భద్రతా దళాలు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించి 51 ఎంఎం మోటార్‌ బాంబులతోపాటు, 260 పీకా రౌండ్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు వీటిని భూమి లోపల దాచినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పేలుడు పదార్థాలను ట్రాల్‌ పోలీసు స్టేషన్‌ సిబ్బంది స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

జమ్ము హైవేపై అనుమానాస్పద బ్యాగ్‌.. ట్రాఫిక్‌ నిలిపివేత

- Advertisement -

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

యూపీలో అస‌దుద్దీన్ రోడ్‌షోకు భారీగా స్పంద‌న.. వీడియో

టూ వీలర్స్ కు అద్దాలు తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జమ్మూకశ్మీర్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
జమ్మూకశ్మీర్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
జమ్మూకశ్మీర్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ట్రెండింగ్‌

Advertisement