Bihar Exit Poll | బిహార్‌లో రాబోయేది మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బిహార్‌లో రెండు విడుతల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించాయి. నవంబర్ 14న జరిగే ఓట్ల లెక్కింపు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, చాలా సంస్థలు మళ్లీ నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువు దీరుతుందని అంచనా వేశాయి. ప్రజాపోల్ అనలటిక్స్ 186 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది. మహాఘట్బంధన్ 50 సీట్లకే పరిమితమవుతుందని.. జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ పార్టీ ఖాతా తెరిచే అవకాశం లేదని చెప్పింది.
మ్యాట్రిక్స్ ఐఏఎన్ఎస్ ఎన్డీఏ 147 నుంచి 167, మహాఘట్బంధన్కు 70 నుంచి 90, ప్రశాంత్ కిశోర్‌కు జన్సూర్కు సీట్లు ఏమీ రావని చెప్పింది. ఇతరులకు రెండు నుంచి ఆరు సీట్లు వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్‌లో ఎన్డీఏకు 133 నుంచి 159, మహాఘట్బంధన్కు 75 నుంచి 101, జన్‌సూరజ్ పార్టీకి ఐదు, ఇతరులకు 2 నుంచి 8 సీట్లు వస్తాయని చెప్పింది. జేవీసీ పోల్‌లో ఎన్డీఏకు 135 నుంచి 150 వరకు, మహాఘట్బంధన్కు 88 నుంచి 103, ప్రశాంత్ కిశోర్ పార్టీకి కొటి, ఇతరులకు 3 నుంచి 6 వరకు, పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్‌పోల్‌లో ఎన్డీఏకు 133 నుంచి 148, మహాఘట్బంధన్కు 87 నుంచి 102, జన్‌సూరజ్ పార్టీకి సున్నా నుంచి రెండు, ఇతరులకు 2-8, చాణక్య స్ట్రాటజీస్లో ఎన్డీఏకు 130 నుంచి 138, మహాఘట్ బంధన్‌కు 100 నుంచి 108, ఇతరులకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని చెప్పింది.
ఇక పోల్‌స్టార్ట్ ఎన్డీఏకు 133 నుంచి 148, మహాఘట్బంధన్కు 87 నుంచి 102, ఇతరులకు మూడు నుంచి ఐదు సీట్లు వస్తాయని.. పోల్‌డైరీ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏకు 184 నుంచి 209 సీట్లు వస్తాయని పేర్కొనగా.. మహాఘట్బంధన్కు 32 నుంచి 49, ఇతరులకు ఒకటి నుంచి ఐదు వస్తాయని చెప్పింది. ప్రజాపోల్ అనలిటిక్స్ ఎన్డీఏకు 186, మహాఘటబంధన్‌కు 50, ఇతరులకు సున్నా నుంచి 7 వరకు వస్తాయని అంచనా వేయగా.. టిఫ్ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ ఎన్డీఏకు 145 నుంచి 163, మహాఘట్బంధన్ కూటమికి 76 నుంచి 95, ఇతరులకు మూడు నుంచి ఆరు వరకు సీట్లు వస్తాయని అంచనా వేసింది. పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఎన్డీఏకు 142 నుంచి 162, ఎన్డీఏకు 80-98, జనసూరజ్ పార్టీకి ఒకటి నుంచి నాలుగు, ఇతరులకు మూడు వరకు సీట్లు రావొచ్చని చెప్పింది.

Bihar Exit Polls