Manmohan Singh | న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్(92) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ చాలా సాదాసీదా జీవితాన్ని గడిపారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా తన పదవిలో కొనసాగారు. చాలా తక్కువగా మాట్లాడుతూ.. దేశానికి ఎన్నో ఉపయుక్తమైన సేవలందించారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు.
మన్మోహన్ సింగ్ ఆస్తుల గురించి చెప్పాలంటే… ఆయన ఆస్తుల విలువ రూ.15 కోట్ల 77 లక్షలు. రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. ఢిల్లీ, చండీగఢ్‌లో ఆయనకు ఫ్లాట్ మాత్రమే ఉంది. అఫిడవిట్ ప్రకారం మన్మోహన్ సింగ్‌కు ఎలాంటి అప్పులు లేవు. డాక్టర్ మన్మోహన్ సింగ్ వినయం, పని పట్ల నిబద్ధతత చాటుకొని రాజకీయ నాయకులకు రోల్‌మోడల్‌గా నిలించారు. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రధానమంత్రి పదవిని వీడిన తర్వాత మన్మోహన్ సింగ్ తన భార్యతో నివసిస్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, భార్య గురుశరణ్ కౌర్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Manmohan Singh | దేశానికి దశదిశ చూసిన ప్రధాని.. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనదే..!
Manmohan Singh | భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మన్మోహన్.. 1991 బడ్జెట్ ఓ గేమ్ ఛేంజర్
Manmohan Singh: మారుతీ 800 కారంటే మన్మోహన్‌కు ఇష్టం !