న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)కు .. మారుతీ 800 కారంటే అమితమైన ఇష్టం. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో.. ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ అసిమ్.. మన్మోహన్‌కు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్‌గా చేశారు. మన్మోహన్ మారుతీ 800 కారును చాలా ఇష్టపడేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం యూపీలోని కన్నౌజ్ సర్దార్ నుంచి అసిమ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మన్మోహన్ చాలా సింపుల్‌గా ఉండేవారన్నారు. ఆయనకు ఒకే ఒక్క స్వంత కారు ఉండేదని, అది మారుతీ 800 కారు అని తెలిపారు. ప్రధాని ఇంటి వద్ద .. బీఎండబ్ల్యూ బుల్లెట్ ప్రూఫ్ కారుకు సమీపంలోనే ఆ మారుతీ కారు పార్క్ అయి ఉండేది. ఇది నా కారు, నా స్వంత కారు అని మన్మోహన్ ఎప్పుడూ చెప్పేవారని అసిమ్ గుర్తు చేశారు.
2004 నుంచి 2007 మధ్య కాలంలో ఎస్పీజీ ప్రొటెక్షన్ టీమ్‌లో అరున్ చేశారు. అయితే మధ్యతరగతి కుటుంబానికి చెందిన మన్మోహన్.. ఆయన తన మూలాలను మరిచేవారు కాదన్నారు. బీఎండబ్ల్యూ ఉన్నా.. ఆయన తన మారుతీ కారుకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. సాధారణ ప్రజల గురించి మన్మోహన్ ఎప్పుడు ఆలోచించేవారని అరుణ్ తెలిపారు. బీఎండబ్ల్యూ కారు లగ్జరీ కోసం కాదు, సెక్యూర్టీ కోసం అని మన్మోహన్‌కు చెప్పేవాడినన అసిమ్ తెలిపారు. అయితే ఆ సమయంలో.. ఖరీదైన కారు ప్రధానికి చెందుతుందని, కానీ మారుతి కారు మాత్రం తనదే అని చెప్పేవారని గుర్తు చేశారు.
మన్మోహన్ సింగ్ గురువారం ఢిల్లీలో మరణించారు. ఆయనకు రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇవాళ ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఆయన మృతికి నివాళి అర్పించారు.