న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ అన్ని విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మంగళవారం ఓ వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో విమర్శించారు.
దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు వినియోగిస్తున్నదని, వ్యవస్థలపై దాడి చేస్తున్నదని, స్వతంత్రమైన న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని, మీడియాను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య స్తంభాలను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు.