జమ్ము: భారత్లో మెజారిటీ ముస్లింలు హిందూయిజం నుంచి మతం మారిన వారేనని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. కశ్మీరీ పండిట్లు ఇస్లాం మతంలోకి మారడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన తెలిపారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకొనేవారు బలహీనులని వ్యాఖ్యానించారు. మతాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకోకూడదని హితవు పలికారు.
‘ముస్లింలు బయట నుంచి వచ్చారని కొందరు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎవరూ బయట నుంచి రాలేదు. మహా అయితే 20 శాతం మంది మొఘల్ సైన్యం నుంచి వచ్చి ఉండొచ్చు. ఇస్లాం కేవలం 1500 ఏండ్ల క్రితం నుంచే ఉంది కానీ హిందూ మతం చాలా పురాతనమైనది’ అని ఆజాద్ అన్నారు. హిందువుల అస్థికలను కలిపిన నదుల నీళ్లనే అందరూ తాగుతున్నామని.. ముస్లింల శరీరాలు కూడా ఈ మట్టిలోనే కలుస్తున్నాయని.. ఇద్దరి మధ్య భేదం ఏమున్నదని ఆయన ప్రశ్నించారు.