PM Modi | న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుధవారం జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా రూపొందించిన స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది విజయ దశమి నుంచి 2026 విజయదశమి వరకు సంఘ్ శతాబ్దిని జరుపుంటుందని.. సంస్థ శతాబ్ది ఉత్సవాలను వీక్షించే అదృష్టం మాకు కలిగిందన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలీరామ్ హెడ్గేవార్‌కు నివాళులర్పించారు.
#WATCH | Delhi | PM Narendra Modi arrives at Dr. Ambedkar International Centre to participate in the centenary celebrations of the Rashtriya Swayamsevak Sangh (RSS) as the Chief Guest.
Source: DD pic.twitter.com/i9E4XFH1dF
— ANI (@ANI) October 1, 2025
విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రేపు విజయ దశమి అనే గొప్ప పండగను జరుపుకోబోతున్నామని.. అన్యాయంపై న్యాయం విజయం, అసత్యంపై సత్యం, చీకటిపై వెలుగు సాధించిన విషయంగా పేర్కొన్నారు. వందేళ్ల కిందట ఇంత గొప్ప పండుగ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపన యాదృచ్చికం కాదన్నారు. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం పునరుజ్జీవనం, ఆ యుగం సవాళ్లను ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు కొత్త అవతారాల్లో జాతీయ చైతన్యం వ్యక్తమవుతుందని.. ఈ యుగంలో సంఘ్ శాశ్వతమైన జాతీయ చైతన్యం సద్గుణ అవతారమన్నారు. ఆర్ఎస్ఎస్ తన అద్భుతమన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ నేడు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా పోస్టల్ స్టాంప్, స్మారక నాణేలను విడుదల చేసిందన్నారు. వాటి ప్రత్యేకతను వివరిస్తూ.. రూ.100 నాణెం ఒక వైపు జాతీయ చిహ్నం, మరొక వైపు వరద ముద్రలో సింహంతో కూడిన భరతమాత చిత్రం ఉందని తెలిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో భారత మాత చిత్రం భారత కరెన్సీపై కనిపించడం ఇదే మొదటిసారి కావొచ్చన్నారు. ఈ నాణెంపై ఆర్ఎస్ఎస్ నినాదం ‘రాష్ట్రే స్వాహా, ఇదం రాష్ట్రాయ ఇదం న మమ’ కూడా ఉందన్నారు.
#WATCH | Delhi | PM Narendra Modi releases a specially designed commemorative postage stamp and coin highlighting the RSS’ contributions to the nation, on the occassion of the organisation’s centenary celebrations.
Source: DD pic.twitter.com/8pMYdvMXzK
— ANI (@ANI) October 1, 2025
సంఘ్ గురించి మాట్లాడుతూ.. సాధారణ ప్రజలంతా కలిసి వచ్చి అసాధారణమైన, అపూర్వమైన పని చేస్తారన్నారు. నేటికీ సంఘ్ శాఖల్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అందమైన ప్రక్రియను చూస్తున్నామన్నారు. సంఘ్ శాఖా మైదానం ఒక స్ఫూర్తిదాయకమైన భూమి, ఇక్కడ స్వచ్ఛంద సేవకుడు అహం నుంచి స్వయం వరకు ప్రయాణం ప్రారంభిస్తాడని.. సంఘ్ శాఖలు వ్యక్తిత్వ వికాసానికి త్యాగపూరిత వేదికలని పేర్కొన్నారు. సంఘ్‌పై జరిగిన కుట్రలను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. స్వాతంత్ర్యం తర్వాత సంఘ్‌ను అణిచివేయడానికి ఎలా ప్రయత్నాలు జరిగాయో మనం చూశామని.. ప్రధాన స్రవంతిలోకి రాకుండా నిరోధించడానికి లెక్కలేనన్ని కుట్రలు జరిగాయన్నారు. పరమ పూజ్య గురూజీని తప్పుడు కేసులో ఇరికించారని.. జైలుకు కూడా పంపారన్నారు. ‘కొన్నిసార్లు నాలుక దంతాల కింద నొక్కినప్పుడు, అది నలిగిపోతుంది. కానీ, మనం దంతాలు విరగ్గొట్టకోము. ఎందుకంటే దంతాలు మనవే. నాలుక కూడా మనదే’ అన్నారు. సంఘ్ ప్రారంభం నుంచి దేశభక్తి, సేవకు పర్యాయపదమని.. విభజన బాధ లక్షలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసినప్పుడు, స్వచ్ఛంద సేవకులు శరణార్థులకు సేవ చేవారన్నారు.