liquor policy Case | మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ సమన్లు.. కేజ్రీ వ్యక్తిగత సహాయకుడి వాంగ్మూలం నమోదు
liquor policy Case | ఢిల్లీ మధ్యం కుభకోణం కేసు (Delhi liquor policy Case)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆప్ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు (AAP MLA) ఈడీ నోటీసులు పంపింది.
liquor policy Case | ఢిల్లీ మధ్యం కుభకోణం కేసు (Delhi liquor policy Case)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆప్ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు (AAP MLA) ఈడీ నోటీసులు పంపింది. ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ (Durgesh Pathak)కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు పంపారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ మధ్యాహ్నం ఆయన ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
‘ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్యే పాఠక్‌కు ఈడీ అధికారులు సమన్లు పంపారు. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నగదు చెల్లింపులకు సంబంధించి పాఠక్ పేరు ప్రస్తావనలోకి వచ్చింది. ఆయన ఇవాళ మధ్యాహ్నం ఈడీ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే జైలుకెళ్లిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ (Bibhav Kumar)ను కూడా ఈడీ ప్రశ్నించింది. సోమవారం ఉదయం ఈడీ కార్యాలయంలో బిభవ్‌ను అధికారులు ప్రశ్నించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం బిభవ్ కుమార్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
కాగా, మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకూ నలుగురు ఆప్ నేతలు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు పలు కేసుల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాళ్లు కూడా ప్రస్తుతం తీహార్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవలే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్‌పై బయటకు వచ్చారు.
#WATCH | AAP MLA Durgesh Pathak arrives at the ED office in Delhi after he was summoned by the agency in the Delhi Excise policy case pic.twitter.com/IBd5dMZhfo
— ANI (@ANI) April 8, 2024
Also Read..
Russia | మంచు కరిగి నిండిన నదులు.. రష్యాను ముంచెత్తిన ఆకస్మిక వరదలు
Jewellery | కర్ణాటకలో భారీగా పట్టుబడిన బంగారం, నగదు.. వీడియో
Engine Cover | విమానం గాల్లో ఉండగా ఊడిన ఇంజిన్ కవర్.. షాకింగ్ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

