Encounter | ఛత్తీస్‌గఢ్ (Chattisgarh)లో మరోసారి ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో బీజాపూర్ సరిహద్దు వద్ద భద్రతా బలగాలు (security forces), నక్సలైట్ల (Naxals)కు మధ్య గురువారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
భద్రతా సిబ్బంది గురువారం ఉదయం సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని అటవీప్రాంతంలో నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చావన్ (Kiran Chavan) తెలిపారు.
కాగా, మూడు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులకు పేలుళ్లకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా భేద్రే కుట్రు రహదారిలో ఐఈడీ పేలుళ్లకు మావోయిస్టులు పాల్పడ్డారు. ఐఈడీ పేలిన సమయంలో పోలీసుల వాహనంలో 15 మంది డీఆర్జీ జవాన్లు ఉన్నారు. ఈ దుశ్చర్యలో 8 మంది జవాన్లతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
Also Read..
Wildfires | లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు.. కాలి బూడిదైపోయిన బైడెన్ కుమారుడి ఇల్లు