భువనేశ్వర్: విదేశీ భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలు(Pravasi Bharatiya Express)ను ప్రారంభించింది. భువనేశ్వర్‌లో జరుగుతున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఈ రైలును వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎన్ఆర్ఐ టూరిస్టుల కోసం ఈ రైలును స్టార్ట్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయలుదేరింది. మూడు వారాల జర్నీ ఉంటుంది. దేశంలోని పలు సంప్రదాయ, మతపరమైన ప్రదేశాలను ఆ రైలు చుట్టివస్తుంది.
ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్‌ను.. ప్రత్యేక టూరిస్టు రైలును రూపొందించారు. విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం ఈ టూరిస్టు రైలు కాన్సెప్ట్‌ను డెవలప్ చేశారు. 45 ఏండ్ల నుంచి 65 ఏండ్ల మధ్య ఉన్నవారు ఈ రైలులో ప్రయాణం చేయవచ్చు. తమ చారిత్రాత్మక మూలాలను టచ్ చేసే రీతిలో ఈ రైలు రూట్‌ను క్రియేట్ ఛేవారు.
ఢిల్లీ నుంచి బయలుదేరిన రైలు.. ఆ తర్వాత అయోధ్య చేరుకుంటుంది. అక్కడ నుంచి పాట్నా, గయా, వారణాసి, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, కొచ్చి, గోవా, ఎక్తా నగర్(కేవడియా), అజ్మీర్, పుష్కర్, ఆగ్రా పట్టణాలను ఆ రైలు చుట్టువస్తుంది. ఈ రైలులో 156 మంది ప్రయాణికుల ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. విదేశాంగ శాఖ, భారతీయ రైల్వే, ఐఆర్సీటీసీ కలిసి .. ప్రవాసీ రైలును స్టార్ట్ చేశారు. వివిధ దేశాల్లోని భారతీయ ఎంబసీల నుంచి ఈ రైలు ప్రయాణికుల కోసం దరఖాస్తు చేశారు. తక్కువ ఆదాయం ఉన్న వారికి ఈ రైలులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారు.
విదేశాంగ శాఖ ప్రకారం.. రైలు టూరుకు చెందిన అన్ని ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆయా దేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రవాసీల రిటర్న్ విమాన ఖర్చులో 90 శాతం కూడా ప్రభుత్వమే పెట్టుకోనున్నది. ప్రయాణికులు కేవలం 10 శాతం ఛార్జీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలులో టూర్ చేసే వారికి 4స్టార్ హోటల్ అకామిడేషన్ ఇవ్వనున్నారు. రైలు ఆవిష్కరణ గురించి మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ ట్వీట్ చేశారు.
#WATCH | 18th Pravasi Bharatiya Divas | PM Narendra Modi in Bhubaneswar today flagged off the inaugural journey of the Pravasi Bharatiya Express, a special Tourist Train for the Indian diaspora
Video source: Railways Minister Ashwini Vaishnaw/X pic.twitter.com/Z1p0DXF1vI
— ANI (@ANI) January 9, 2025