Wildfires | లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు.. కాలి బూడిదైపోయిన బైడెన్ కుమారుడి ఇల్లు
Wildfires | అమెరికాలో కార్చిచ్చు (Wildfires) బీభత్సం సృష్టిస్తోంది. ఈ కార్చిచ్చులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కుమారుడు హంటర్ బైడెన్ (Hunter Biden) నివాసం కూడా బూడిదైపోయినట్లు తెలిసింది.
Wildfires | అమెరికాలో కార్చిచ్చు (Wildfires) బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైల్డ్‌ఫైర్ కారణంగా అమెరికాలోని సంపన్నుల నగరంగా పేరొందిన లాస్ ఏంజెల్స్ (Los Angeles) కాలి బూడిదైపోతోంది. ఈ ప్రాంతంలో హాలీవుడ్ స్టార్స్‌తోపాటు బిలియనీర్లు నివసిస్తుంటారు. దీంతో మంటల్లో ఖరీదైన ఇళ్లు, కార్లు, ఇతర వస్తువులు మంటల్లో బూడిదవుతున్నాయి. ఈ కార్చిచ్చులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కుమారుడు హంటర్ బైడెన్ (Hunter Biden) నివాసం కూడా బూడిదైపోయినట్లు తెలిసింది.
Hunter Biden’s Malibu home burned to the ground by LA fire.#HollywoodFire pic.twitter.com/pk830mYEJx
— Pat López Carrere (@LopezCarrere) January 9, 2025
మాలిబులోని హంటర్ బైడెన్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన మాన్షన్ పూర్తిగా దగ్ధమైపోయింది. ఇంటి ముందు ఉన్న ఖరీదైన కారు సైతం కాలి బూడిదైపోయింది. ఈ మాన్షన్ ఖరీదు 15,800 అమెరికా డాలర్లుగా తెలుస్తోంది. మాన్షన్ మొత్తం కాలి బూడిదైపోయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
బిలియనీర్లు నివసించే పసిఫిక్ పాలిసేడ్స్‌తో పాటు పలు చోట్ల మంగళ, బుధవారాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఈ కార్చిచ్చు బారిన పడి ఇప్పటి వరకూ ఐదుగురు మృతి చెందగా, చాలామంది గాయపడ్డారు. 3 వేలకు పైగా విస్తీర్ణంలో ఉన్న 10 వేలకు పైగా ఇండ్లు మంటల్లో చిక్కుకోగా అందులో వెయ్యికి పైగా గృహాలు ధ్వంసమయ్యాయి. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు లాస్ ఏంజెల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంటోని మార్రోన్ తెలిపారు. ఈ ప్రమాదంలో శాంటామోనికా ప్రాంతంలో ఖరీదైన ఇళ్లు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.
ఖరీదైన ఇళ్లు, కార్లు, విలువైన సామగ్రి మంటల్లో కాలిబూడిదయ్యాయి. చాలా మంది తమ సామాన్లు, కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోయిన వారిలో పలువురు బిలియనీర్లతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీ జేమ్స్ ఉడ్స్, స్టీవ్ గుటెన్బర్గ్ తదితరులు ఉన్నారు. ఈ కార్చిచ్చు కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దాదాపు 50 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది.
🔥 #Wildfire Hits LA Districts, Firefighters Face Challenges
A wildfire in Pacific Palisades grows to 1,261 acres, with footage spreading on social media. #LosAngeles #US #Sputnik pic.twitter.com/SpFBqeNoiU
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) January 8, 2025
Also Read..
Wildfire | అమెరికాలో కార్చిచ్చు బీభత్సం.. వేలాది సంపన్నుల నివాసాలు బుగ్గి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

