Encounter | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. బీజాపూర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ( Dantewada Bijapur border) చోటు చేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు (Naxalites) హతమయ్యారు.
ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న ముందస్తు సమాచారంతో భద్రతా బలగాలు (soldiers) ఆపరేషన్ ప్రారంభించారు. సోదాల సమయంలో భద్రతా బలగాలకు మావోలు తారసపడ్డారు. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకూ 10 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
‘దంతెవాడ – బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో వెస్ట్ బస్తర్ డివిజన్‌కు చెందని మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం అందింది. పోలీసులు అర్ధరాత్రి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో మావోలు – పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది’ అని దంతెవాడ పోలీసులు తెలిపారు.
Also Read..
Bengal Assembly: బెంగాల్ అసెంబ్లీలో యాంటీ రేప్ బిల్లు
IIT Bombay | ఐఐటీ బాంబే విద్యార్ధులకు బంపర్ ఆఫర్ : 22 మందికి రూ కోటికి పైగా వేతన ప్యాకేజ్
Bus Crash | విద్యార్థులు, తల్లిదండ్రులపైకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు.. 11 మంది మృతి