IIT Bombay : ఐఐటీ బాంబే 2023-24 విద్యా సంవత్సరానికి ప్లేస్మెంట్ సీజన్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. 1475 మంది విద్యార్ధులు ప్లేస్‌మెంట్స్ దక్కించుకున్నారని ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో పేర్కొంది. 2023-24 ప్లేస్‌మెంట్స్ సీజన్లో సగటు వార్షిక వేతనం రూ. 23.5 లక్షలుగా ఉంది. ఇక 22 మంది విద్యార్ధులు ఏకంగా రూ. కోటికి పైగా వేతన ప్యాకేజ్‌లను సొంతం చేసుకున్నారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో అత్యధిక విద్యార్ధులకు ఆఫర్లు లభించాయి.
వివిధ ఇంజనీరింగ్ డొమైన్లలో 430 మంది విద్యార్ధులకు 106 కోర్ ఇంజనీరింగ్ కంపెనీలు ఎంట్రీ లెవెల్ పొజిషన్స్‌ను ఆఫర్ చేశాయి. గత ఏడాదితో పోలిస్తే ఐటీ, టెక్ హైరింగ్ ఈ ఏడాది స్వల్ప వృద్ధి నమోదు చేయడం విశేషం. క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా 307 మంది విద్యార్ధులను 84కిపైగా కంపెనీలు ఐటీ, సాఫ్ట్వేర్ జాబ్‌లను ఆఫర్ చేశాయి. ఇంజనీరింగ్ రంగం ద్వారా ఐటీ రంగం రెండో అతిపెద్ద రిక్రూటర్‌గా నిలిచింది.
ఆపై ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫిన్‌టెక్ కంపెనీలు కూడా నియామకాల్లో పలువురు విద్యార్ధులను ఎంపిక చేసుకున్నాయి. ఈ ఏడాది 33 ఫైనాన్షియల్ సేవల కంపెనీలు 113 ఆఫర్లను విద్యార్ధులకు అందించింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, మొబిలిటీ, 5జీ, డేటా సైన్స్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ కూడా మెరుగైన హైరింగ్ ట్రెండ్స్ నమోదు చేశాయి. ప్లేస్‌మెంట్స్‌లో 388 కంపెనీలు చురుకుగా పాల్గొనగా, 364 కంపెనీలు ఆఫర్లను అందించాయి.
Read More :
Illegal Affair | ఒకే మహిళతో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ వివాహేతర సంబంధం.. సస్పెండ్