కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ(Bengal Assembly)లో ఇవాళ యాంటీ రేప్ బిల్లును ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి మోలే ఘాటక్ ఆ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సుమారు రెండున్నర గంటల పాటు చర్చించనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు శిఖా ఛటర్జీ, అగ్నిమిత్రా పౌల్తో పాటు ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడనున్నారు. ప్రభుత్వం తరపున సీఎం మమతా బెనర్జీ ప్రసంగిస్తారు. అత్యాచార నిందితులకు మరణ దండన విధించే రీతిలో బిల్లులో ప్రతిపాదనలు చేశారు. రేప్, గ్యాంగ్ రేప్ కేసుల్లో నిందితులకు పెరోల్ లేకుండా జీవిత కాల శిక్ష వేయాలన్న సూచన కూడా చేశారు.
ఆ బిల్లును అపరాజితా వుమెన్ అండ్ చైల్డ్ బిల్లు 2024గా పిలుస్తున్నారు. మహిళలు, పిల్లల రక్షణకు కొత్త చట్టాన్ని రూపొందించారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఇటీవల ట్రైనీ వైద్యురాలు హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో దీదీ సర్కారు.. కఠిన చట్టాలతో కూడిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
#WATCH Kolkata: West Bengal Leader of Opposition Suvendu Adhikari says, “…We want immediate implementation of this (Anti-rape) law, it is your (state government) responsibility. We want results, it is the government’s responsibility. We do not want any division, we fully… pic.twitter.com/xOZgaDckPQ
— ANI (@ANI) September 3, 2024