Nepal | నేపాల్ (Nepal)లో అవినీతిపై యువత కదం తొక్కింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాలీ యువత చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. వేల మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తంచేస్తున్నారు. కర్ఫ్యూని సైతం లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి రహదారులను దిగ్బంధించారు. ఈ ఆందోళనలతో హిమాలయ దేశం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
నేపాల్‌లోని భారతీయుల సహాయార్థం కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయం (Embassy of India Kathmandu) టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. భారతీయ పౌరులు (Indian nationals) ఏదైనా అత్యవసర పరిస్థితిలో లేదా సాయం అవసరమైతే వెంటనే 977-980 860 2881, 977-981 032 6134 నంబర్లను సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
All Indian nationals in Nepal are hereby requested to note the following telephone numbers from the Embassy of India, Kathmandu, for contact, in case they are facing any emergency situation or require assistance:
1. +977 – 980 860 2881
2. +977 – 981 032 6134@MEAIndia
— IndiaInNepal (@IndiaInNepal) September 9, 2025
భారతీయులకు కీలక అడ్వైజరీ
మరోవైపు యువత ఆందోళనతో భారత్ (India) అప్రమత్తమైంది. ఈ మేరకు నేపాల్‌లోని భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నిన్నటి నుంచి నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. రాజధాని కాఠ్మాండు సహా అనేక నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. నేపాల్‌లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడి అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి’ అని ప్రకటనలో తెలిపింది.
Also Read..
India-Nepal border | భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్