ఖాఠ్మాండు: నేపాల్ పార్లమెంట్(Nepal Parliament) మంటల్లో బూడితవుతోంది. స్థానిక యువత తీవ్ర ఆందోళన చేపట్టడంతో.. ఆ దేశంలో పరిస్థితులు అదుపు తప్పాయి. ఇవాళ ఉదయం పార్లమెంట్ బిల్డింగ్‌లోకి ప్రవేశించిన నిరసనకారులు.. ఖాఠ్మాండులో ఉన్న ఆ బిల్డింగ్‌కు నిప్పుపెట్టారు. దీంతో ప్రధాని ఓలీ రాజీనామా చేసి పరారీ అయ్యారు. సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోవడంతో.. దేశవ్యాప్తంగా యువత రగిలిపోయారు.
ప్రధాన నగరాల్లో చేపట్టిన ఆందోళనలు చివరకు విధ్వంసానికి దారి తీశాయి. ఉప్పెనలా మారిన ప్రజల్ని అదుపు చేసేందుకు భద్రతా దళాలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. వాళ్లు చేతులు ఎత్తేయడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. నేపాల్ రాజకీయ చరిత్రలోనే తీవ్ర స్థాయి పోరాటం జరిగింది.
అనేక మంది మంత్రులు ఇవాళ హెలికాప్టర్ల ద్వారా పరారీ అయ్యారు. నిరసనకారులు సుప్రీంకోర్టుకు కూడా నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది.
Nepal’s parliament is on fire, marking a new beginning. #Nepal pic.twitter.com/nXbDgC7FG3
— trending Nepal (@trending_Nepal) September 9, 2025
Protestors storm #Nepal parliament in Kathmandu as ministers flee in helicopters. pic.twitter.com/3QhgEDScui
— Ahmer Khan (@ahmermkhan) September 9, 2025
Nepal PM Oli resigns. Protestors set the Nepalese Parliament on fire. pic.twitter.com/jBSJo8WxdY
— snehanshu shekhar 🇮🇳 (@snehanshus) September 9, 2025