Nepal | హిమాలయ దేశం నేపాల్ (Nepal)లో అవినీతిపై యువత కదం తొక్కింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాలీ యువత చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. వేల మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తంచేస్తున్నారు. కర్ఫ్యూని సైతం లెక్కచేయకుండా వీధుల్లోకి వచ్చి రహదారులను దిగ్బంధించారు.
నేపాల్ అధ్యక్షుడు, ప్రధాని, పార్లమెంట్, సుప్రీంకోర్టు సహా మంత్రులు, ఇతర రాజకీయ నేతల ఇండ్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. భక్తపూర్ (Bhaktapur)లోని ప్రధాని కేపీ శర్మ ఓలి (PM K.P. Sharma Oli) ప్రైవేట్ నివాసంపై దాడి చేసిన నిరసనకారులు.. దానికి నిప్పు పెట్టారు. అనంతరం డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Nepal: Protesters dance and celebrate as the private residence of former PM K.P. Sharma Oli, in Bhaktapur, burns. The Nepali PM resigned this afternoon amid demonstrations against the Government over alleged corruption.
(Video Source: TV Today Nepal) pic.twitter.com/d71H1bQ1KJ
— ANI (@ANI) September 9, 2025
యువత ఆందోళనలతో రాకీయ సంక్షోభం తలెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగడంతో నేపాలీ ప్రధాని ఈ మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దేశంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ఆయన దేశం విడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇవాళ సాయంత్రం కొత్త ప్రధాని (New Pirme Minister) ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read..
India-Nepal border | భారత్-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్
KP Sharma Oli | నేపాల్లో కొనసాగుతున్న హింస.. ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా