తిరువనంతపురం: సఫారి ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటిని కాళ్లతో తొక్కి చంపింది. (Elephant Tramples Mahout) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 20న సాయంత్రం 6:30 గంటల సమయంలో అడిమాలి సమీపంలోని కల్లార్లో ప్రైవేట్ సఫారీ సెంటర్లో ఒక ఏనుగు ఆగ్రహం చెందింది. పర్యాటకుల సఫారీ కోసం సిద్ధం చేస్తున్న 62 ఏళ్ల బాలకృష్ణన్పై అది దాడి చేసింది. ముందు కాళ్లతో తొక్కి చంపింది. ఆ తర్వాత తొండంతో అతడ్ని విసిరేసింది. ఇది చూసి అక్కడున్న సిబ్బంది షాక్ అయ్యారు. ఆ ఏనుగును నియంత్రించేందుకు ప్రయత్నించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు సఫారీ కేంద్రానికి చేరుకున్నారు. ఆ కేంద్రంలోని ఏనుగులు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ కాలేదని గుర్తించారు. ప్రైవేట్
సఫారీని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని కేసు నమోదు చేశారు. మావటిని ఏనుగు చంపిన నేపథ్యంలో ఏనుగు సఫారీని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ సఫారీ కేంద్రంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
INDIA – 🇮🇳 6/20/24 – A mahout (elephant trainer) named Balakrishnan, 62, was trying to get the elephant to move into position for a tourist to ride when the elephant turned against him. I’m sure all that poking and prodding doesn’t feel so good. More info in comments.” pic.twitter.com/xXrncV7D3o
— The Many Faces of Death (@ManyFaces_Death) June 21, 2024