Elephant | కర్ణాటక (Karnataka)లోని బందీపూర్ నేషనల్ పార్క్ ( Bandipur National Park)లో ఇద్దరు టూరిస్ట్‌లకు (tourists) ఊహించని అనుభవం ఎదురైంది. ఓ పేద్ద ఏనుగు (Elephant) వారిని వెంబడించింది. దీంతో ఇద్దరు టూరిస్ట్‌లు ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. చివరికి ఏనుగు దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
ఇద్దరు టూరిస్ట్‌లు కర్ణాటక నుంచి బందీపూర్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ (Tiger Reserve) మీదుగా కేరళకు వెళ్తున్నారు. దారి మధ్యలో వారికి ఓ పేద్ద ఎనుగు కనిపించింది. ఆ ఏనుగుతో వారు సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఏనుగు ఆ ఇద్దర్నీ వెంబడించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన ఆ ఇద్దరు వ్యక్తులూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. చివరికి ఓ వ్యక్తి కిందపడిపోవడంతో ఏనుగు కాలితో తొక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
2 tourists were confronted by an elephant While traveling from #Karnataka to #Kerala through #Bandipur National Park & Tiger Reserve. #Elephant became aggressive when the tourists attempted to take a #selfie, chased them but fortunately, both managed to narrowly escape unharmed. pic.twitter.com/1uIzW7ITiY
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) February 1, 2024
Also Read..
Arvind Kejriwal | ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఐదో సారీ డుమ్మా
Congress | మహారాష్ట్ర కాంగ్రెస్‌కు షాక్.. ఎన్సీపీలో చేరనున్న మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్
Solapur | ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తూ విద్యార్థినులను వేధిస్తున్నాడని కుమారుడిని చంపిన తండ్రి