Congress | మహారాష్ట్ర కాంగ్రెస్‌కు షాక్.. ఎన్సీపీలో చేరనున్న మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్
మహారాష్ట్ర కాంగ్రెస్‌కు (Congress) వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండటంతోపాటు సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేకపోవడం, రాష్ట్రంలో బీజేపీ (BJP) కూటమికి ఎదురులేకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా తమదారి తాము చూసుకుంటున్నారు.
ముంబై: మహారాష్ట్ర కాంగ్రెస్‌కు (Congress) వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండటంతోపాటు సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేకపోవడం, రాష్ట్రంలో బీజేపీ (BJP) కూటమికి ఎదురులేకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా తమదారి తాము చూసుకుంటున్నారు. వారం రోజుల క్రితం మాజీ మంత్రి మిలింద్ దేవరా (Milind Deora) కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా.. మరో సీనియర్ నాయకుడు బాబా సిద్దిఖ్ (Baba Siddique) పార్టీకి రాజీనామా చేశారు. తన కుమారుడు, ఎమ్మెల్యే జీశన్తో కలిసి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌ను కలిశారు. దీంతో ఆయన అజిత్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతారని తెలుస్తున్నది.
బాబా సిద్ధిఖ్ బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విద్యార్థి దశలో స్టూడెంట్ లీడర్‌గా పనిచేసిన ఆయన ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999 నుంచి 2009 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర హౌసింగ్, ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ముంబై డివిజన్ చైర్మన్‌గా వ్యవహరించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలర్ చేతిలో ఓడిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

