న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 : విద్యుత్తు రంగం ప్రైవేటీకరణను నిరసిస్తూ జూన్ 26న దేశ వ్యాప్త సమ్మెకు అఖిల భారత పవర్ ఇంజినీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ఆదివారం పిలుపునిచ్చింది. విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ(ఎన్సీసీఓఈఈఈ) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిందని ఏఐపీఈఎఫ్ తెలిపింది. జూన్లో జరిగే సమ్మెను విజయవంతం చేయడానికి ఏప్రిల్, మేలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ సదస్సులు నిర్వహించాలని ఎన్సీసీఓఈఈఈ నిర్ణయించింది. యూపీలో విద్యుత్తు రంగం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాలుగు భారీ ర్యాలీలనూ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రైవేటీకరణ వల్ల వినియోగదారులపై అధిక చార్జీల భారం పడుతుందని సమావేశం పేర్కొంది.