న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ మరోసారి అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీని ఉద్దేశించి ఆయన.. విద్వేషాన్ని ఓడించేందుకు ఎన్నికలే సరైన సమయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ హిందీలో ఓ ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ బీజేపీ ఓడించాలని పరోక్షంగా ట్వీట్ చేశారు.
ఫిబ్రవరి 10 నుంచి మొత్తం ఏడు దశల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 7న ఏడో దశ పోలింగ్ పూర్తికానుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బీజేపీని ఓడించడంతోపాటు పంజాబ్‌లో తిరిగి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది.