పాట్నా, జూలై 6: బీహార్లో అర్హత కలిగిన పౌరులు ఆన్లైన్లో ఓటరుగా పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి విధించిన నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం యూ టర్న్ తీసుకుంది. దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తున్నట్టు వార్తా పత్రికలలో పూర్తి పేజీ ప్రకటనను ప్రచురిందింది. అర్హత గల పౌరులు తమ వద్ద ఫొటోలు, ఇతర అవసరమైన ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా అధికారికి తమ దరఖాస్తులను సమర్పించవచ్చునని తెలిపింది.
‘ఓటర్ వద్ద నిర్ధారిత ధ్రువపత్రాలు కనుక లేకపోతే ఆ అధికారి స్థానిక విచారణ, లేదా ఇతర ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.’ అని పేర్కొంది. అయితే 2023 జనవరి 1 నాటికి ఓటరు లిస్టులో పేర్లను నమోదు చేసుకున్న వారు ఎలాంటి ధ్రువపత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.