Election Commission | ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనున్నది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో సహా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణలు షెడ్యూల్ కంటే వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. దాంతో ఆయా రాష్ట్రాల్లో గడువును పొడిగించడాన్ని ఈసీ పరిశీలించే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రాధాన్యంగా భావిస్తుంది. సర్ ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను ఫేక్ ఓట్లను తొలగించడం, మరణించి వారి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను జాబితాను తొలగించి.. అర్హత కలిగిన (18 సంవత్సరాలకుపైబడిన) వారి పేర్లను చేర్చడం సర్ ముఖ్య ఉద్దేశం. బిహార్ ఎన్నికలకు ముందు సర్ కార్యక్రమాన్ని అమలు చేసిన ఈసీ.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో కార్యక్రమం కొనసాగుతున్నది. బూత్ స్థాయి అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల పేర్లను ధ్రువీకరిస్తున్నారు.
చాలా మంది బీఎల్వోలుగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. దాంతో పరిమిత సమయంలో జాబితాను వెరిఫై చేయడం సవాల్‌గా మారుతున్నది. యూపీ ఎన్నికల ప్రధాన అధికారి నవదీప్ రిన్వా బుధవారం మాట్లాడుతూ సర్ని పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని రెండువారాల సమయం కోరినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 99.24 శాతం జనాభా గణన ఫారాలు డిజిటలైజ్ చేయబడ్డాయని.. నవంబర్ 4 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును ఎన్నికల సంఘం సవరించింది. ఫైనల్ లిస్ట్‌ను ఫిబ్రవరి 14కి మార్చింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన సవరించిన షెడ్యూల్ ప్రకారం.. బూత్ స్థాయి అధికారులు నిర్వహించే ఇంటింటి సర్వే డిసెంబర్ 11తో ముగుస్తుంది. ముసాయిదా ఓటర్ల జాబితాను 16న ప్రచురిస్తారు. ఆ తర్వాత జనవరి 15 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. తుది జాబితాను 14న ప్రచురిస్తారు.