Eknath Shinde | మిలింద్ దేవరా చేరికపై ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు
Eknath Shinde : కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షిండే సారధ్యంలోని శివసేనలో చేరనుండటంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు.
Eknath Shinde : కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షిండే సారధ్యంలోని శివసేనలో చేరనుండటంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. మిలింద్ దేవరా శివసేనలో చేరాలని నిర్ణయించుకుంటే తాను స్వాగతిస్తానని స్పష్టం చేశారు.
మిలింద్ దేవరా వ్యవహారం తాను విన్నానని, ఆయన తమ పార్టీలో చేరితే స్వాగతిస్తానని షిండే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత, దక్షిణ ముంబై మాజీ ఎంపీ మిలింద్ దేవరా ఆదివారం ఉదయం ప్రకటించారు. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన మధ్య లోక్‌సభ సీట్ల సర్ధుబాటు చర్చల పట్ల అసంతృప్తితో మిలింద్ దేవరా కాంగ్రెస్‌ను వీడారని చెబుతున్నారు.
కాగా, ప్రస్తుత రాజకీయాలు అధికారం చుట్టూ తిరుగుతున్నాయని, సిద్ధాంతం, విలువలు, విశ్వాసానికి చోటు లేదని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. మిలింద్ తండ్రి మురళి దియోర దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని, అధికార దాహంతోనే మిలింద్ దియోర శివసేన షిండే వర్గంలో చేరుతున్నారని దుయ్యబట్టారు.
Read More :
Sanjay Raut | అధికార దాహంతోనే మిలింద్ కాంగ్రెస్‌ను వీడారు : సంజయ్ రౌత్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

