Sanjay Raut : మహారాష్ట్ర (Maharastra) మాజీ ముఖ్యమంత్రి (Former CM), ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి (Deputy CM) ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ను ఉద్దేశించి ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ ఎంపీ (Shiv Sena) సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్‌థాకరే (Uddav Thackeray), రాజ్‌థాకరే (Raj Thackeray) చేతులు కలుపడంపై షిండే ఎగతాలి వ్యాఖ్యలు చేయడాన్ని రౌత్ తప్పుపట్టారు.
ఏక్నాథ్ షిండే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు గుమస్తా అని ఎద్దేవా చేశారు. ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీకి అధ్యక్షుడు అమిత్‌షానే అని, షిండే కేవలం ఆయన చేతికింద గుమస్తా అని వ్యాఖ్యానించారు. ఇద్దరు అన్నదమ్ములు చేతులు కలిపితే ఏక్నాథ్ షిండేకు ఈర్ష్య ఎందుకని ప్రశ్నించారు. అమిత్‌షాకు గుమస్తాగా మారినందుకు షిండే ఈర్ష్య చెందాలని అన్నారు.