న్యూఢిల్లీ, మార్చి 25 : మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన సొంత మహాయుతి కూటమి, అధికార బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సతార జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ నేతలు పలు అక్రమాలకు పాల్పడ్డారని, పౌరులు ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని విమర్శించారు. కాగా, తన సొంత కూటమి ప్రభుత్వంపైనే షిండే విమర్శలు చేయడం అసాధారణమని, రెండు పార్టీల మధ్య విభేదాలకు ఇది చిహ్నమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కాగా, మార్చి 20న జరిగిన సతార ఎన్నికల్లో చైర్మన్ పదవికి శివసేన పోటీ చేసింది. శివసేన-ఎన్సీపీ కలిసి పోటీ చేసి గరిష్ఠ ఓట్లు తెచ్చుకున్నప్పటికీ బీజేపీకి చెందిన ప్రియా షిండే చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. కాగా, శివసేన సభ్యులు కొందరిని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు స్థానిక పోలీసులు ఓటింగ్ వేయకుండా నిర్బంధించారని షిండే ఆరోపించారు.